పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్​-1 థియేటర్లలో ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ స్దాయి అద్భుత విజయం సాధించిన తర్వాత అభిమానులు, సినీ ప్రియులు సీక్వెల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూంటారు సహజం. అయితే ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాసం లేదని తేల్చేసారు. ఆయన రీసెంట్ గా సినిమా గురించి చేసిన కామెంట్స్ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్‌పై స్ట్రైట్‌గా చెప్పేసారు. మొదట ప్లాన్ ప్రకారం 2025 ఎండ్‌లో షూట్ స్టార్ట్ చేసి, 2026-27లో రిలీజ్ చేయాలనుకున్నాడట . కానీ రియాలిటీ చెక్ వేసుకుంటే – స్టార్‌ల డేట్స్, ప్రొడక్షన్ స్కేల్, టైమ్ టేకింగ్ విజువల్స్ – అన్నీ కలిపి ప్లాన్‌కి మించిన డిలే అవుతున్నాయని ఆయన చెప్పేశాడు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…”సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరు (నటులు) బిజీగా ఉన్నారు. కాబట్టి ఇది నా చేతిలో లేదు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. షూటింగ్​కు కాస్త సమయం పడుతుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ మరింత టైమ్ తీసుకుంటుంది. మరో 2-3 ఏళ్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది” అని చెప్పారు.

దాంతో, “కల్కి 2 ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేను” అనే విషయం క్లియర్ అయిపోయింది. ఈ అప్‌డేట్ విన్న తర్వాత ఫ్యాన్స్ మిక్స్‌డ్ రియాక్షన్స్‌లో ఉన్నారు – “వెయిట్ ఎంతైనా చేస్తాం బ్రో, కానీ లెవెల్ మాత్రం అదే ఉండాలి” అంటున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from