పాట్రియాటిక్ రొమాంటిక్ డ్రామా “తండేల్”తో చాలా రోజుల తరువాత మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, చైతన్య కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తండేల్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చైతూ, ఇప్పటికే తన నెక్ట్స్ సినిమా పనులు మొదలుపెట్టాడు.

ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ డండు. కథాంశంగా ఇది ఓ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌లో విఎఫ్ఎక్స్ కీలకంగా ఉండనుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతన్య ఇదొక ట్రెజర్ హంట్ అడ్వెంచర్ అని పేర్కొన్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయబోయే అతిపెద్ద సినిమా ఇదేనంటూ ఆయన చెప్పడం ప్రాజెక్ట్‌పై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ఇక సోషియల్ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ సినిమాకి “వృషకర్మ” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పేరు పరిశీలనలో ఉంది.

ఈ ప్రతిష్టాత్మక సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అలాగే, ఇటీవల “లాపటా లేడీస్” చిత్రంతో గుర్తింపు పొందిన స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా “కాంతార” ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ పని చేయనున్నారు.

ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ చైతన్యకు మరో మైలురాయిగా మారుతుందా? వేచి చూడాల్సిందే!

, ,
You may also like
Latest Posts from