పుష్ప 2 సంఘటనతో టిక్కెట్ రేట్లు పెంచటం, అలాగే స్పెషల్ షోలు వంటివి తెలంగాణాలో ప్రస్తుతానికి ఉండేలా కనపడటం లేదు. అందుకు నిదర్శనం తండేలు సినిమానే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలవుతోంది. సినీ నిర్మాణ సంస్థ అభ్యర్ధన మేరకు ఏపీ ప్రభుత్వం తొలివారం రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.75 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఖరి స్పష్టం చేసేశారు. పైగా తెలంగాణ హైకోర్టు కూడా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు, అదనపు షోలు అనుమతించవద్దని చెప్పేసింది. ఈ క్రమంలో తండేల్ సినీ నిర్మాణ సంస్థ ఆ ప్రభుత్వాన్ని అభ్యర్ధించలేదు.

తండేల్‌ని భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించినప్పటికీ, ఎటువంటి హడావుడీ లేకుండా మొన్న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించుకోవలసి వచ్చింది.

ఇది ఇక్కడితో ఆగేలా లేదు…త్వరలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నితిన్ రాబిన్ హుడ్, చిరంజీవి-‘విశ్వంభర’, ప్రభాస్‌-‘రాజాసాబ్’, పవన్ కళ్యాణ్‌-‘హరిహర వీరమల్లు’ విడుదలవుతాయి. వాటిమీదా ఇంపాక్ట్ పడేలా కనపడుతోంది.

ఈ క్రమంలో ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసినా తెలంగాణలో మాత్రం మామూలు సినిమాలుగానే ఆడించుకోవలసి ఉంటుందని అందరికి స్పష్టమైంది.

, , , ,
You may also like
Latest Posts from