నాని (Nani) హీరోగా ఓదెల శ్రీకాంత్‌ (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది పారడైజ్‌’ (The Paradise). షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రిలీజ్‌కి ముందే బ్లాక్‌బస్టర్ టాక్‌ దక్కించుకుంటోంది. ఎందుకంటే, ఈసారి నాని మార్కెట్‌ని కేవలం పాన్ ఇండియా వరకే కాకుండా, గ్లోబల్ రేంజ్ కి తీసుకెళ్తున్నాడు.

దానికి నిదర్శనం – మార్కెటింగ్ కోసం ఏకంగా హాలీవుడ్ కంపెనీనే తీసుకొస్తున్నాడు . సమాచారం ప్రకారం, “ది ప్యారడైజ్” టీమ్ హాలీవుడ్‌లోని ప్రముఖ మార్కెటింగ్ ఫర్మ్ ConnekktMobScene తో చర్చలు జరుపుతోంది. ఈ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి తో డిస్కషన్స్ జరుగుతున్నాయని టాక్. అంటే సినిమా ప్రమోషన్స్, బ్రాండింగ్, ఇంటర్నేషనల్ రీచ్ అన్నీ హాలీవుడ్ స్టాండర్డ్‌లో ఉండబోతున్నాయి.

అంతే కాదు… హాలీవుడ్ టాప్ యాక్టర్‌ని కూడా ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ప్రమోషన్‌కి అనుసంధానం చేయడానికి చర్చలు నడుస్తున్నాయి. ఇది ఫైనల్ అయితే, “ది ప్యారడైజ్” గ్లోబల్ స్టేజ్‌పై మరింత హైప్ క్రియేట్ చేయడం ఖాయం.

ఇకపోతే, ఈ సినిమాలో బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాఘవ జూయల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం కూడా స్పెషల్ హైలైట్.

మార్చ్ 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో – తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ – గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది ఈ మల్టీలాంగ్వేజ్ మాసివ్ వెంచర్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మొత్తానికి, నాని తన “ది ప్యారడైజ్”తో కేవలం సినిమా కాకుండా, ఇంటర్నేషనల్ మువ్మెంట్ క్రియేట్ చేయబోతున్నాడనే హైప్ మాక్సిమమ్ రేంజ్‌కి చేరింది.

, , , , , , ,
You may also like
Latest Posts from