నాని – సుజీత్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో పవన్ కళ్యాణ్ తో చేస్తున్న OG షూటింగ్‌లో జాప్యం వల్ల ఈ సినిమా డైలమాలో పడిపోయిందన్న పుకార్లు షికార్లు చేశాయి. కానీ నాని తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు – ఈ సినిమా రద్దు కాలేదు, స్క్రీన్‌మీద అదిరిపోయేలా ఎంట్రీ ఇవ్వబోతోంది… అదీ కూడా ఓ గమ్మత్తైన టైటిల్ తో అని అని తెలుస్తోంది. ఇంతకీ ఏమిటా టైటిల్…
సుజీత్ డైరెక్షన్‌లో నాని చేస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు “బ్లడీ రోమియో” అనే టైటిల్ పరిగణనలో ఉందని నాని స్వయంగా చెప్పారు. HIT 3 ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడిన నాని, ఈ సినిమాను 2026లో థియేటర్లలోకి తీసుకొస్తామని వెల్లడించారు.
“బ్లడీ రోమియో” టైటిల్‌తో!
అయితే “బ్లడీ రోమియో”… ఈ టైటిల్ కొంచెం విపరీతంగా, కొంచెం కవితాత్మకంగా, మూడ్‌లో మర్మంగా ఉంది కదా? నానిలా సాఫ్ట్‌గా కనిపించే హీరో నుంచి ఇలాంటి బోల్డ్ టైటిల్ రావడం ఏంటీ? అసలు ఇది కథలో ఏం ఉండబోతుందో అన్న టాక్ జోరుగా ఉంది.
నాని ఎప్పుడూ ట్రెండీ టైటిల్స్ ఎంచుకుంటారు:
జెర్సీ – ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా
శ్యామ్ సింగ రాయ్ – డ్యూయల్ షేడ్, పీరియాడిక్ ఎలిమెంట్స్
దసరా – మాస్, మట్టి వాసన, రవ్వలు ఎగురేసే కథ
ఇప్పుడు బ్లడీ రోమియో?
ఈ టైటిల్ చూస్తే, ఇది ఏదో ప్రేమకథ కాదు – ఇది ప్రేమలో పగ కలిసిపోయిన కథ అయి ఉండొచ్చు. ఒక మృదువైన మనసు, హింసాత్మకమైన ప్రపంచంలో ఎలా నిలబడతుందో చెప్పే కథ కావచ్చు.
నాని ఇలా బోల్డ్, డార్క్, రా క్యారెక్టర్ ఎంచుకోవడం కొత్తగా ఉంటుంది. 2026లో “ది ప్యారడైజ్”తో పాటు ఈ సినిమాను తెరపైకి తీసుకురానున్న నాని… తన కెరీర్‌లో మళ్లీ ఒక మైలు రాయిని చేరడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తోంది.
నాని నుంచి ఇది మరో న్యూఏజ్ మాస్ క్లాసిక్ అయ్యే అవకాశం ఉంది!