సినిమా సక్సెస్ లో లో భాగంగా విలన్ పాత్ర ఎంత బలంగా, గ్రౌండెడ్‌గా, వాస్తవికంగా ఉండాలో దర్శకులు ఎప్పుడూ గమనిస్తారు. అదే పంథాలో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ కూడా విలన్ ఎంపిక విషయంలో అంతే జాగ్రత్తగా ముందుకెళ్తోంది.

నాని vs రాఘవ్ జుయెల్ – ది బాటిల్ బిగిన్స్!

నేచురల్ స్టార్ నాని హీరోగా, “దాసరా” ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయెల్ ఎంపికయ్యాడని సమాచారం!

‘కిల్’ వంటి హై ఇంటెన్సిటీ యాక్షన్ మూవీలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్, ఇప్పుడు నానికి సరిపడే స్ట్రాంగ్ క్యారక్టర్ కోసం ఎంచుకోబడటం నిజమైతే అది సినిమాకే హెలెట్. శ్రీకాంత్ ఓదెల రాఘవ్ యొక్క హావభావాలు, ఆహార్యంతో కూడిన యాక్టింగ్‌ని చూసి ఈ పాత్రకు ఫిక్స్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ ఇప్పటికే ఎంపిక కాగా, నాని తల్లి పాత్ర కోసం మరాఠీ నటి సోనాలి కులకర్ణి పేరును పరిశీలిస్తున్నారు. ఇది సెంటిమెంట్‌కు బలం చేకూర్చే పాత్ర అని సమాచారం. ప్యారడైజ్ టీమ్ పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా, కథకు న్యాయం చేసే నటీనటులను మాత్రమే తీసుకుంటున్నారు.

ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటుండగా, ప్రతీ పాత్రకు బలమైన బ్యాక్‌స్టోరీ ఉందని సమాచారం. ముఖ్యంగా విలన్ పాత్ర సర్వసాధారణమైన క్యారెక్టర్ కాదు — కథను ముందుకు నడిపించే కీలక కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుంటోందట.

, ,
You may also like
Latest Posts from