న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్-3: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సైకో థ్రిల్లర్ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమా నష్టాలు తెచ్చిపెట్టే పరిస్దితి కనపడుతోంది. వివరాల్లోకి వెళ్తే…
మే 1న విడుదలైన ‘హిట్ 3’ సినిమాకు విడుదలైన అన్ని ప్రాంతాల్లో బలమైన ఓపెనింగ్స్ లభించాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మరియు నైజాం ప్రాంతాల్లో సినిమా అద్భుతంగా ఫెరఫార్మ్ చేసింది. ఫస్ట్ వీకెండ్‌లో మిగతా ఏరియాల్లో కూడా సినిమా ఓ మాదిరిగా సంతృప్తికరమైన రెస్పాన్స్‌ను రాబట్టింది.
అయితే వీకెండ్ ముగిసిన తరువాత బాగా డ్రాప్ కనిపించింది. వేసవి సీజన్ కావడాన్ని బట్టి చూస్తే, సినిమా ఆశించిన స్థాయిలో హోల్డ్ అవ్వలేకపోయింది. ముఖ్యంగా ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో పంపిణీదారులకు నష్టాలు తప్పేటట్లు లేదు.
అయినా కూడా, ‘హిట్ 3’ సినిమా నాని కెరీర్‌లో మరో విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఈ సినిమా నాని, అతని నిర్మాణ సంస్థకు మంచి లాభాలను అందించింది.