నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు.
స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఇక ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని ZEE5, శాటిలైట్ రైట్స్ ని ZEE Telugu భారీ మొత్తం ఇచ్చి తీసుకుంది. ఈ సినిమా రిలీజైన 45 రోజుల్లో ఓటిటిలోకి వచ్చేటట్లు ఎగ్రిమెంట్ చేసుకున్నారని సమాచారం.