
ఎన్‌టీఆర్ – త్రివిక్రమ్ మళ్లీ కలుస్తున్నారు! ఈ సారి మామూలు ఎంటర్టైనర్ కాదు… ఒక భవ్యమైన మిథలాజికల్ డ్రామా!
సినిమా టైటిల్ — ‘గాడ్ ఆఫ్ వార్’. కథ మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ — యుద్ధదేవుడు కుమారస్వామి (కార్తికేయుడు / మురుగన్) గాధ ఆధారంగా. తమిళ ప్రాంతాల్లో మురుగన్‌కు ప్రత్యేక భక్తి ఉన్నప్పటికీ, ఆయన గాథను ఇప్పటివరకు పెద్దగా సినిమాల్లో చూడలేదు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయబోతున్నాడు త్రివిక్రమ్!
ఇటీవల వచ్చిన రూమర్ల ప్రకారం ప్రాజెక్ట్ డిలే అవుతుందని, త్రివిక్రమ్ వెంకటేష్‌తో కొత్త సినిమా మొదలుపెట్టడంతో, ఎన్‌టీఆర్ “డ్రాగన్” షూట్ 2026 లేట్ వరకు సాగుతుందని చర్చ జరిగింది. కానీ… ఇన్‌సైడ్ సోర్సెస్ చెప్పింది మాత్రం షాక్ ఇస్తోంది — ‘గాడ్ ఆఫ్ వార్’ పూర్తి ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది!
ఎన్‌టీఆర్ “డ్రాగన్” పూర్తయ్యాక నేరుగా ఈ సినిమాకే వెళ్తాడు — మధ్యలో మరే ప్రాజెక్ట్‌కి సైన్ చేయడంలేదు. త్రివిక్రమ్ కూడా తన వెంకటేష్ మూవీని 2026 సమ్మర్‌లో కంప్లీట్ చేసి, వెంటనే ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రీ-ప్రొడక్షన్‌లోకి దూకబోతున్నాడు.
షూటింగ్ ప్రారంభం: 2027 ప్రారంభంలో!
కాంబినేషన్: ఎన్‌టీఆర్ – త్రివిక్రమ్ – మిథాలజీ – మాస్ ఎమోషన్!
