
పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది. షెడ్యూల్ ప్రకారం ప్రీమియర్స్ రెడీగా ఉండాలి, కానీ సినిమా కంటెంట్ మాత్రం చివరి నిమిషంలోనే థియేటర్లకు డిస్పాచ్ చేయబడింది. ఎందుకు ఈ రష్ అనేది ఇప్పటివరకు క్లారిటీగా బయటకు రాలేదు.
సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రీమియర్స్‌తోనే రికార్డులు కొట్టబోతుందని ఆల్రెడీ జరిగిన బుకింగ్స్ తో అర్దమవుతోంది. కానీ అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం మాత్రం చివరి నిమిషంలో జరిగిన రీ-ఎడిటింగ్ డ్రామా.
కొన్ని రోజుల క్రితం పవన్‌తో పాటు మొత్తం టీమ్ ఫైనల్ కట్ చూశాక, సినిమాలో ఉన్న ‘సాహో’ రిఫరెన్స్ ఫుటేజ్‌ను ట్రిమ్ చేయాలని డిసైడ్ చేశారు. సోషల్ మీడియాలో అప్పటికే ‘ఓజీ – సాహో’ కనెక్షన్‌పై బజ్ మొదలైపోయింది. అయితే క్లిప్స్, వీడియోలు వదిలేయకుండా కేవలం పేర్ల రూపంలోనే కనెక్షన్ చూపించాలని నిర్ణయించారు. ఇది విన్న వెంటనే సినీ లవర్స్ లో ఓ డౌట్ – “సుజీత్ యూనివర్స్ మొదలవుతోందా?”
అసలు ప్లాన్‌లో ‘They Call Him OG’ లో సాహో నుంచి డైరెక్ట్ విజువల్ రిఫరెన్స్‌లు ఉండగా, ఇప్పుడు వాటిని తొలగించి ఫ్లో క్లీన్ చేశారని సమాచారం.
ఈ ఎడిటింగ్ వల్లే కంటెంట్ డెలివరీ ఆలస్యమై, టీమ్ చివరి నిమిషంలో టెన్షన్ ఫేస్ చేసింది. అయినా ఫైనల్ అవుట్‌పుట్‌పై క్రూ పూర్తిగా కాన్ఫిడెంట్‌గా ఉందని టాక్. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఈ రాత్రే అన్ని చోట్ల గ్రాండ్ ప్రీమియర్స్ పెట్టబోతున్నారు.
