ఓ భారత సైనికుడు జపాన్‌లో యుద్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు ఓజెస్ గంభీర (పవన్ కళ్యాణ్) ను ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ పెంచుతాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. కానీ ఒక రోజు ఆ స్థావరంపై శత్రువులు దాడి చేసి అందరినీ చంపేస్తారు. బ్రతికేది ఒక్క గంభీర మాత్రమే! ఇదే సమయంలో సత్యదాదా (ప్రకాశ్ రాజ్) తన స్నేహితుడు మిరాజ్‌కర్ (తేజ్ సప్రూ)తో కలిసి బంగారంతో పారిపోతూ పోర్ట్‌కు వస్తాడు. అక్కడ వారిపై దాడి జరుగుతుంది. అప్పుడు వారిని కాపాడేది గంభీరే!

ఆ క్షణం నుంచి గంభీర సత్యదాదా నీడగా మారతాడు. ముంబైలో పోర్ట్ నిర్మించి, దాన్ని మంచి పనులకు వాడుకుంటూ సత్యదాదా డాన్ అవతారంలో ఎదుగుతాడు. అతని అండగా నిలుస్తాడు గంభీర.

అదే సమయంలో మిరాజ్‌కర్ కన్ను సత్యదాదా పోర్ట్‌పై పడుతుంది. స్నేహితుడినే మోసం చేసి దాన్ని చేజిక్కించుకోవాలని యత్నిస్తాడు. కానీ అప్పుడు గంభీర.. సత్యదాదాకు అండగా నిలుస్తాడు. ఆ తర్వాత ముంబైలో గంభీర పేరు అంటేనే వణుకు. ఎవ్వరూ ఎదురుపడే సాహసం చేయరు.

కాలం మారుతుంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మిరాజ్‌కర్ తిరిగి పోర్ట్‌పై కన్నేస్తూనే ఉంటాడు. అతని కొడుకులు జిమ్మి (సుదేవ్ నాయర్), ఓమి (ఎమ్రాన్ హష్మీ) రంగంలోకి దిగుతారు. ఆర్డీ ఎక్స్ కంటైనర్ కోసం జిమ్మి, సత్యదాదా చిన్న కొడుకు పార్థు (వెంకట్)ని హత్య చేస్తాడు. సిటీని రక్తంతో నింపేస్తాడు. చివరికి సత్యదాదాను చంపే కుట్ర పన్నుతారు.

కానీ… గంభీర ఎక్కడ?

ఆ సమయానికి గంభీర వారితో లేడు. 15 ఏళ్లుగా నాసిక్‌లో భార్య కన్మణి (ప్రియాంక మోహన్), కూతురుతో జీవిస్తున్నాడు. ఇదే అదనుగా భావించి మిరాజ్‌కర్ గ్యాంగ్ సత్యదాదాపై దాడి చేస్తుంది. మరి సత్యా దాదా కోసం ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? మిరాజ్ కర్ కొడుకులకు ఓజీ ఎలా బుద్థి చెప్పాడు?

ముంబై అండర్ వరల్డ్ ను ఒకప్పుడు గడగడలాడించిన ఓజీ 15 ఏళ్లుగా సత్యదాదాకు ఎందుకు దూరంగా ఉన్నాడు?అసలు ఎందుకు అజ్ఞాతం లోకి వెళ్ళాల్సి వచ్చింది? కన్మణితో అతని ప్రేమకథ ఏంటి? శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ పాత్రలు ఓజీకి ఎలా లింక్ అవుతాయి? అతని జీవితంలోని విషాదం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే… థియేటర్‌లో “OG” చూడాల్సిందే!

  • ఎనాలసిస్ …

మీరు ఓ కొత్త కథ కోసం ఈ సినిమా కు వెళ్తే మాత్రం ఇది నిరాశపరుస్తుంది. అయితే మీరు కథలకోసం సినిమాకు ఎందుకు వెళ్తాం అనే లాజిక్ తీస్తే మాత్రం ఇది ఎంతో కొంత రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఎన్నో గ్యాంగ్‌స్టర్ సినిమాలలో ఈ థీమ్ ని వందలసార్లు చూశాం. ఈ సారి కొత్తేమిటి అంటే సుజీత్ ఈ కథని పవన్ కళ్యాణ్ చుట్టూ మళ్లీ డిజైన్ చేశాడు. దర్శకుడు సుజీత్ ఫోకస్ ప్రేక్షకులకు బలమైన సినిమా ఇవ్వడంపై కాకుండా, పవన్ కళ్యాణ్‌కి ఒక లవ్ లెటర్ రాసినట్టే ఉంది.

కథనానికి కావాల్సిన సంఘర్షణలు అన్నీ హీరో ఎలివేషన్ కి మార్గం చూపించే బ్లాకుల్లా వాడారు. OGలో బయిటకు కనపడే కాంప్లిక్ట్ RDX కంటైనర్, మాఫియా గ్యాంగ్ . కానీ ఇన్నర్ కాంప్లిక్ట్ OG గిల్ట్, లాయల్టీ, లవ్, లాస్. ఇవి రెండు విడివిడిగా ఉన్నాయి. దాంతో ప్లాట్ సరిగా డవలప్ కాలేదు. కథనం మొదటి నుంచి “OG ఎవరు?,అతను ఏమయ్యాడు, ఎప్పుడు వస్తాడు” అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది.

సినిమా మొత్తం హీరోను ఎలివేట్ చేయటంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తుంది. చెప్పడమే ఎక్కువ, చూపించడం మాత్రం తక్కువ. చివరికి చూస్తే, పవన్ కోసం ఐదు ఎలివేషన్ బ్లాక్స్ డిజైన్ చేసి, వాటి చుట్టూ కథని కట్టినట్టే అనిపిస్తుంది.

అయినా గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు ఎప్పుడూ మూడు కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి:

విశ్వాసం (loyalty)

ద్రోహం (betrayal)

ప్రతీకారం (revenge)

OGలో ఇవన్నీ ఉన్నప్పటికీ, వాటికి ఎమోషనల్ వెయిట్ ఇవ్వలేదు.

OGలో నిజమైన ఫోకస్ ఏమిటంటే… పవన్ ఎలివేషన్స్… హీరో ఎంట్రీ, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, క్లైమాక్స్ …ఇవి ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్ . కానీ సినిమా నేరేటివ్ ‌గా చూస్తే, కథ హీరోకి యాడ్ ఆన్ లా అనిపిస్తుంది. OGలో అన్ని వాయిస్‌లు హీరో ని గ్లోరిఫై చేయడానికే వాడబడ్డాయి. అలాగే OGని ఒక లెజెండ్ లా బిల్డ్ చేశారు. కానీ ఒక పాత్రగా డవలప్ చేయలేదు.

  • టెక్నికల్‌గా బ్రిలియన్స్

థమన్ BGM – ఆక్సిజన్ లాంటిది.

రవి కె. చంద్రన్ విజువల్స్ – నోయర్ టోని ఫెరఫెక్ట్ గా కాప్చర్ చేసారు.

ప్రొడక్షన్ స్కేల్ గ్రాండ్ గా ఉంది

కానీ ఇవన్నీ స్ట్రాంగ్ రైటింగ్ లేకపోవడం వల్ల, ఒక స్టైలిష్ షెల్ లాగా మాత్రమే కనిపించాయి.

  • ఎవరెలా చేసారు..

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రతీ సీన్ ప్రాణం పెట్టి చేసారనిపిస్తుంది. ఇక ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఉన్నా, పాత్రలో బలమేమీ లేదు. ఎవ్వరైనా ఆ రోల్ చేయగలిగేలా అన్నట్లు రాసేశారు. ఇటీవలి బాలీవుడ్ సినిమాలో (The Ba***ds of Bollywood) అతడు చేసిన చిన్న రోల్‌లో కనిపించిన ఇంపాక్ట్ కూడా ఇక్కడ అస్సలు లేదు.

అలాగే సినిమాలో ఎక్కువ భాగం OG (ఓజస్ గాంభీరా) ఎవరనే ఇంట్రడక్షన్‌లా అనిపిస్తుంది. మధ్యలో కొన్ని సైడ్ స్టోరీస్ – ప్రేక్షకుడు OG పట్ల కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తాయి. కానీ అవి పెద్దగా పని చేయవు.

ప్రియాంకా మోహన్ – పవన్ కెమిస్ట్రీ బాగానే కనిపించినా, వారి లవ్ స్టోరీ, సువ్వి సువ్వి పాట… కథను స్లో చేయటమే తప్ప ప్రయోజనం ఇవ్వలేదు. అర్జున్ దాస్ ప్రతీకారం కారణం దారుణంగా, బలహీనంగా ఉంది. ఆయన ట్రాక్‌లో ట్విస్ట్‌లు చాలా ముందే ఊహించగలిగేవి. శ్రీయా రెడ్డి గీత పాత్రలో స్టాంగ్ గా కనిపించింది. సలార్లో ఇచ్చిన ఇంపాక్ట్‌ను ఇక్కడ కూడా కొనసాగించింది.

  • హై మూమెంట్స్

OG = పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఆయన ఛరిష్మా, లుక్స్, స్లో-మోషన్ యాక్షన్ – ఇవే సినిమా హైలైట్స్. థియేటర్ రియాక్షన్స్ చూస్తే, అభిమానులకు కావాల్సిన అన్నీ ఉన్నాయని చెప్పాలి.

కాస్ట్యూమ్స్, వన్ లైనర్స్, బాగా కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు → ఫ్యాన్స్‌కి ఫీస్ట్. హరి హర వీర మల్లులో లేని ఇంపాక్ట్ ఇక్కడ యాక్షన్‌లో కనిపించింది.

‘వాషి యో వాషి’ హైకు చెప్తున్న సీన్‌లో కూడా పవన్ పూర్తి ఇన్వాల్వ్ అయ్యాడు. కానీ ఎక్కువసార్లు హీరో చేయాల్సిన పని, ఆయన చుట్టూ ఉన్నవాళ్లు – డైరెక్టర్‌తో సహా – చేసి పెట్టినట్టే అనిపిస్తుంది.

  • ఇబ్బందులు

ముఖ్యంగా సాహో యూనివర్స్ కనెక్షన్ ట్రైలర్‌లో వాజి అన్న మాట వినగానే ఫ్యాన్స్ ఊహించారు. సినిమాలో కూడా ఉంది, కానీ బలహీనంగా ఎగ్జిక్యూట్ చేశారు. అలాగే పవన్ 2003 సినిమా జానీకి డైరెక్ట్ రిఫరెన్స్ ఉంది. అది కేవలం నాస్టాల్జియా కోసం మాత్రమే పనిచేస్తుంది.

  • కన్క్లూజన్

“They Call Him OG” → ఇది పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌కి సుజీత్ రాసిన హోమేజ్. కానీ హోమేజ్ అన్నంత మాత్రాన బలమైన సినిమా కాదు. ఈ కథను మనం ఎన్నిసార్లు చూసామో లెక్కే లేదు. అయినా, థియేటర్‌లో ఎండ్ క్రెడిట్స్ వరకూ కూర్చోండి. ఎందుకంటే పోస్ట్-క్రెడిట్ సీన్‌లో రెండో భాగానికి టీజర్ మాత్రమే కాదు, ఓజస్ గంభీరా గురించి ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయనే హింట్ ఇస్తుంది. అయితే సినిమాని రెండున్నర గంటలు చూసాక కూడా OG గురించి కొత్తగా ఏమి తెలుసుకోవాలి అనిపిస్తుందా? అనేది ప్రశ్నే!

, , , , , ,
You may also like
Latest Posts from