పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హై యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే క్రేజ్ పీక్ లో ఉంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ దానికి ప్రూఫ్ గా నిలుస్తున్నాయి. ఈ హైప్ తో పాటు బాక్సాఫీస్ వద్ద సినిమాకి మరో మాస్ లెవెల్ అడ్వాంటేజ్ కూడా దక్కనుంది. ఈ నేఫధ్యంలో ప్రమోషన్స్ ఈ వారం నుంచే అన్ని భాషల్లో స్టార్ట్ కానున్నాయి. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ చూసి ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హైలోకి వెళ్లిపోయాయి.
అలాగే అఖండ 2 పోస్ట్‌పోన్ అయింది. కాంతారా 2 కూడా వెనక్కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జరిగితే They Call Him OG కి డబుల్ బూస్ట్ అన్నమాట. ఈ ఏడాది “సాలిడ్ హిట్స్” దొరకకపోవడమే OG కి నిజమైన అదృష్టం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత 100Cr షేర్ దాటిన సినిమా ఏదీ రాలేదు.వార్ 2, హరి హర వీరమల్లు, కూలీ లాంటి బిగ్గీస్ కూడా కలెక్షన్స్ దగ్గర పడిపోయాయి. ఇదే గ్యాప్ OG కి గోల్డెన్ ఛాన్స్.
పవన్ కళ్యాణ్ – సుజీత్ యాక్షన్ డ్రామా మొదటి రోజు నుంచే పాజిటివ్ WOM దక్కితే, దసరా సెలవులు కలిసొస్తే, OG టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటిగా నిలబడటం ఖాయం.
బాక్సాఫీస్ ఈక్వేషన్ ఒక్కసారిగా పవన్ వైపే తిరుగుతుందా? అనేది ట్రేడ్ లో డిస్కషన్.