పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” “They Call Him OG” సినిమా చుట్టూ ఇప్పటికే ఊహించలేని స్థాయిలో క్రేజ్ నెలకొంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా, ఇటీవలి సంవత్సరాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సోలో రిలీజ్ ఖరారవడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.

మొదట్లో “ఓజీ” – అఖండ 2 రెండూ సెప్టెంబర్ 25నే వస్తాయని నిర్మాతలు ప్రకటించడంతో బాక్సాఫీస్‌ దగ్గర పెద్ద క్లాష్ ఖాయం అనిపించింది. కానీ, కొద్ది రోజులుగా అఖండ 2 రిలీజ్‌పై గాసిప్స్ వినిపించాయి. చివరకు డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్‌ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 రిలీజ్‌ను అక్టోబర్ లేదా డిసెంబర్‌కు వాయిదా వేసే అవకాశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ మొదటి వారం తేదీ ఎక్కువగా ఫిక్స్ అయ్యేలా కనిపిస్తోంది.

దీంతో సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్‌ “ఓజీ”కి సోలో రిలీజ్ ఖాయమైంది. సినిమా చుట్టూ ఇప్పటికే ఉన్న అద్భుతమైన క్రేజ్, ఈ సోలో రిలీజ్‌తో కలసి టాలీవుడ్ చరిత్రలోనే భారీ ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ టాక్.

ఇక పవర్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా పండుగే. ఇప్పటికే ఉన్న మాస్ క్రేజ్ + సోలో రిలీజ్ = బాక్సాఫీస్ దగ్గర 100Cr+ Opening గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

“హరి హర వీర మల్లూ” ఫెయిల్యూర్ తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా డబుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఈసారి OG బ్లాస్ట్ అయితే, పవన్ కెరీర్‌లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనూ ఒక రికార్డ్ ఓపెనింగ్ ఖాయం!

, , ,
You may also like
Latest Posts from