త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూనమ్ కౌర్ వ్యవహారం మళ్లీ ఒక్కసారిగా ఇండస్ట్రీలో బాంబులా పేలింది. ఇదేం తాజా గొడవ కాదన్న సంగతి అందరికీ తెలుసు. గతంలో పలు సందర్భాల్లో త్రివిక్రమ్ పరోక్షంగా తనను తొక్కేశారని, ఎదగకుండా దారులు మూసేశారని పూనమ్ గట్టిగా ఆరోపణలు చేసింది. కానీ ఈసారి విషయం వేరే లెవెల్‌కు వెళ్లింది — పరోక్షంగా కాదు, సూటిగా త్రివిక్రమ్ పేరు చెప్పేసింది.

తాజాగా పూనమ్ కౌర్ ఇనిస్ట్రాలో చేసిన పోస్ట్‌లో,

నేను ఇంతకుముందే ఈ విషయాన్ని చెప్పాను.. మళ్లీ కూడా చెప్తున్నా.. నేను మెయిల్‌ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఆ తర్వాత ఝాన్సీ గారితో మాట్లాడానని.. కానీ మీటింగ్‌ కాస్తా ఆలస్యమవుతుందని చెప్పారని.. అప్పటివరకు తమను డిస్టర్బ్‌ చేయవద్దని చెప్పారని కోరింది.

కానీ ఇక్కడ నేను ఎవరి పేరు చెప్పలేదని అనుకుంటున్నారు.. క్లియర్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది.

ఈ విషయంపై నేను వుమెన్ కమిటీ తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్‌కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్‌షాట్‍ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దాంతోపాటు, తన వద్ద ఉన్న సాక్ష్యాల్లలో భాగంగా — ప్రముఖ యాంకర్ ఝాన్సీతో జరిగిన చాట్ స్క్రీన్‌షాట్లను కూడా ఆమె పబ్లిక్‌ చేసింది. దీంతో ఈ వివాదంలో మరో కీలక పేరైన ఝాన్సీ పేరు కూడా వెలుగులోకి వచ్చింది.

ఇప్పటి వరకూ పూనమ్ వ్యాఖ్యలు ఒక్కటి రెండు రోజులు హంగామా చేసి మౌనంగా మారేవి. కానీ ఈసారి ఆమె గళం మరింత గట్టిగా వినిపిస్తోంది. పైగా ఆధారాలు ఉన్నాయంటూ చెప్పడం, వుమెన్ కమిటీని సంప్రదించడం ఆమె దీన్ని ఈసారి సీరియస్‌గా తీసుకుందన్న సంకేతాలు ఇస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో లైంగిక ఆరోపణలపై స్పష్టత తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పడింది. ఈ కేసులో ఆ కమిటీ ఏం చేస్తుందో, త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇండస్ట్రీలో భద్రత కోసం గళమెత్తిన పూనమ్ ఈసారి మరింత ధైర్యంగా – మరింత బలంగా – నిలబడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వివాదం అక్కడే ఆగదనిపిస్తోంది!

,
You may also like
Latest Posts from