
ప్రభాస్ అంటే మాటలే అవసరం లేదు! డార్లింగ్ సినిమాకు రిలీజ్ అనౌన్స్ అయ్యిందంటే, ఫ్యాన్స్ పండుగ వాతావరణమే. థియేటర్ల ముందు క్యూలు, ఫ్లెక్సీలు, బెనిఫిట్ షోలు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ – ఇలా ప్రతి సినిమాకి నేషన్ వైడ్ సెలబ్రేషన్ అవుతుంది. అదే ప్రభాస్ క్రేజ్.
ఇప్పుడు అందరి దృష్టి మాత్రం పూర్తిగా “ది రాజా సాబ్” మీదే. ఈ సినిమా గురించి ఒక్క అప్‌డేట్ పడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్, సాంగ్, పోస్టర్ ఏది వచ్చినా – జెన్ జీ నుండి మాస్ ఆడియెన్స్ వరకు అందరూ అదే టాపిక్. ఆ స్దాయి హైప్ వేరే ఏ సినిమాకూ కనిపించటం లేదు.
రిలీజ్ డేట్ డ్రామా!
మొదట డిసెంబర్ 5 రిలీజ్ అని లాక్ చేసిన మేకర్స్, తర్వాత సంక్రాంతి 2026కి మార్చేశారు. జనవరి 9, 2026న గ్రాండ్ రిలీజ్ అంటూ కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ… ఇప్పుడు మళ్లీ కొత్త రూమర్ – షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తవ్వడానికి టైమ్ పడుతుందని, సంక్రాంతికీ రావడం కష్టమని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.
అయితే, మేకర్స్ మాత్రం ఫెస్టివల్ రిలీజ్‌కే వస్తామని కన్‌ఫర్మ్ చేస్తున్నారు. కానీ సినిమా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడినందున, అభిమానుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.
ట్రైలర్ హంగామా
ప్రస్తుతం ది రాజా సాబ్ యూనిట్ ట్రైలర్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఈ ట్రైలర్‌ని రిషబ్ శెట్టి “కాంతార చాప్టర్ వన్” థియేటర్లలో అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ట్రైలర్ వాచ్ చేసిన వెంటనే థియేటర్లలో మాస్ రోరింగ్ ఖాయం!
ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు:
“ఏం చేస్తారో మాకు తెలవదు… ఈసారి సంక్రాంతికే రావాలి,సూపర్ హిట్ కొట్టాలి!”
