సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘స్పిరిట్’ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ కూడా పూర్తయింది. ఇటీవలే నిర్మాత భూషణ్‌కుమార్ ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుందని ప్రకటించినా, ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో అది ఆలస్యమైంది.
తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ మూవీ షూటింగ్ మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మొదటి షెడ్యూల్‌లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
స్పిరిట్’ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని సందీప్ రెడ్డి వంగా గతంలో చెప్పారు.
ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాల్ని ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించాడు.
ఆల్రెడీ స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయని, ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవుతుందని హర్షవర్ధన్ తెలిపాడు.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను షూటింగ్‌ను ఇండొనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సందీప్ అక్కడ లొకేషన్ రెక్కీ కూడా చేసినట్టు టాక్.
అక్కడ కొన్ని పోలీస్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. త్వరలోనే షూటింగ్‌తో అప్డేట్‌తో పాటు స్టార్ క్యాస్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్.