పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన తీసుకున్న ఓ డెసిషన్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ‘రాజా సాబ్’ షూటింగ్ చివరి దశ‌లో ఉండగా, ‘ఫౌజీ’లో కూడా కొన్ని సన్నివేశాలు పూర్తిచేశాడు. ఇకపై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే ‘స్పిరిట్’ కోసం మాత్రం ప్రభాస్ ఓ ప్రత్యేక మిషన్‌లోకి దూకాడు.

తాజా టాక్ ఏంటంటే – ఈ సినిమా కోసం ప్రభాస్ భారీగా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరింత స్టైలిష్‌గా, యంగ్ లుక్‌లో కనిపించాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి కండిషన్ పెట్టాడట. అందుకే ప్రభాస్ జిమ్, డైట్‌తో కఠినమైన షెడ్యూల్ ఫాలో అవుతున్నాడని టాలీవుడ్ టాక్.

‘రాధేశ్యామ్’ తర్వాత ‘సలార్’ కోసం ప్రభాస్ బల్కీ లుక్‌లోకి వెళ్లాడు. అదే లుక్‌ను కొనసాగిస్తూ ‘రాజా సాబ్’ చేస్తున్నారు. కానీ ‘స్పిరిట్’ కోసం మాత్రం మరోసారి కొత్తగా అవతారమెత్తాల్సి వస్తోంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తయ్యే వరకు ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొనడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది.

ఇక అసలైన కిక్ ఏంటంటే – నవంబర్ తర్వాతే ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడట. అప్పటివరకు డైరెక్టర్ ఇతర సీన్లతో షూటింగ్ ముందుకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడట.

బాహుబలి బల్కీ లుక్ నుంచి స్మార్ట్ పోలీస్ లుక్‌కి మారబోయే ప్రభాస్ ఎలా కనపడతాడు?

, , , , , ,
You may also like
Latest Posts from