అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇంకా చేస్తూనే ఉంది. సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా రూ. 1830 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జనవరి 17 నుండి మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని మేకర్స్ యాడ్ చేసి ‘పుష్ప 2 రీలోడెడ్’ పేరుతో థియేటర్స్‌లో ప్రదర్శిస్తుండటంతో.. మళ్లీ కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఏదైతేనేం ఓవరాల్‌గా అయితే ఈ సినిమా రూ. 2000 కోట్ల మార్క్ దగ్గరలోకి వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటిటి ప్రకటన వచ్చింది.
జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది.
డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది.
ఓటీటీ వెర్షన్‌ను కూడా ఇదే నిడివితో రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా.. డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల ఓ పాటలో తళుక్కున మెరిసింది.