అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో ఐటమ్ సాంగ్ ఎంంత పెద్ద హిట్టైందో తెలిసిందే కదా. శ్రీలీల ఇరగతీసిన ఆ సాంగ్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ పాట లిరిక్స్ నే టైటిల్ గా పెట్టి తెలుగులో ఓ సినిమా రిలీజ్ కాబోతుంది. ‘కిస్ కిస్ కిస్సిక్’ టైటిల్ తో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 21న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
మార్చి 1న హిందీలో ‘పింటూ కీ పప్పీ’ పేరుతో సినిమా రిలీజైంది. ఇప్పుడు దాన్ని పేరు మార్చి, దక్షిణాది భాషల్ల విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫన్నీగా ఉంది. హీరో ఎవరికి ముద్దుపెడితే.. ఆ అమ్మాయిలకు మరొకరితో వెంటనే పెళ్లి అయిపోయింది.
ఈ క్రమంలోనే హీరో.. తన ముద్దు పవర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఇందులో అతిథి పాత్రలో నటించాడు.