సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో తొలిసారి పని చేస్తున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజా క్రేజీ ప్రాజెక్ట్‌ ‘కూలీ’పై ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌లో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ… రజనీ గారి సినిమాల్లో తాను ‘దళపతి’ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతానని, ‘కూలీ’ చిత్రాన్ని రూపొందించేటప్పుడు ఆ ఫీలింగ్‌నే నిలబెట్టేందుకు ప్రయత్నించానని తెలిపాడు.

తాజాగా ‘కూలీ’ ఫైనల్ కట్ చూశారని, దాన్ని చూసిన తర్వాత రజనీకాంత్ గారు చాలా ఎమోషనల్‌గా స్పందించారని చెప్పాడు.
“ఇది నాకు ‘దళపతి’ సినిమాను గుర్తు చేసింది” అని రజనీ గారు చెప్పారని, వెంటనే లేచి వచ్చి తనను హత్తుకున్నారని లోకేశ్‌ చెప్పాడు.
ఆ అభినందనతో తన రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయానని చెప్పాడు లోకేశ్ కనకరాజ్.

ఇంతటి స్టేట్‌మెంట్‌ రావడంతో ‘కూలీ’పై అంచనాలు మళ్లీ పెరిగిపోయాయి. రజనీ మార్క్ మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ నిర్ధారించారు.

ఈ భారీ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్‌ తో పాటు నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, సత్యరాజ్, రెబా మోనికా జాన్, సౌబిన్ బాషీర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.అలాగే బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్ ఖాన్ ఓ పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. మ్యూజిక్‌ను అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.

కూలీ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌ ఉంది.

ఫస్ట్ లుక్‌, మ్యూజిక్, డైరక్టర్-హీరో కాంబినేషన్‌, తలపతి స్టైల్ టచ్ – ఇవన్నీ కలిసి ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రజనీ మార్క్ మాస్ మాసాలా మళ్లీ తెరపై దూసుకెళ్తుందా? అన్న ఉత్కంఠ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

, , , ,
You may also like
Latest Posts from