రజనీ, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ సినిమాపై హైప్ ఇప్పటికే తార స్థాయిలో ఉంది. అఫీషియల్ ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కాకపోయినా… ఈ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ సర్కిల్స్‌లోనూ ‘కబాలి’ స్థాయి ఈఫోరియా క్రియేట్ అవుతోంది.
‘మోనికా’ పాటతో హైప్ లెవెల్ 2.0!
ఇటీవల విడుదలైన ‘మోనికా… మోనికా…’ అనే మాస్ బీట్ సాంగ్ అంచనాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఈ పాట యూట్యూబ్ తెలుగు ట్రెండ్స్‌లో నంబర్ 1 స్థానంలో దూసుకెళ్తోంది. తెలుగు మార్కెట్‌లోనూ ఈ సినిమా మీద స్టార్ హీరో స్థాయి అంచనాలు ఉన్నాయి
గ్లింప్స్ కూడా లేదు… కానీ బజ్ షేకింగ్
ఇంకా ఈ చిత్రానికి సంబంధించి…
ఫుల్ లెంగ్త్ గ్లింప్స్ లేదు
స్టార్ కాస్ట్ మొత్తం కనిపించే టీజర్ లేదు
థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాలేదు
కానీ మళ్లీ మళ్లీ ఒకటే మాట వినిపిస్తోంది – ఇది కబాలీ తరహాలో ఓపెనింగ్స్ పడే సినిమా.
కబాలి తరహా రికార్డులు కూలీతో వస్తాయా?
‘కబాలి’ సినిమాకు అప్పట్లో వచ్చిన ఈఫోరియా ఎవరికైనా గుర్తుండే ఉంటుంది. కేవలం టీజర్‌తోనే కోట్ల వ్యూస్, బుకింగ్స్ ఓపెన్ కాగానే సెకండ్స్‌లో హౌస్‌ఫుల్స్… బాడ్ టాక్ వచ్చినా 90 కోట్లు ఓపెనింగ్ కలెక్షన్స్. అది కాలంలో కోలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా రికార్డు కూడా!
ఇప్పుడీ ‘కూలీ’ ఆ దిశగా అదే జాడలో నడుస్తోంది. ఈసారి రజనీ పక్కన లోకేష్ కనగరాజ్ ఉన్నాడు. ఇంకేంటి? సినిమా ఎక్కడినుంచి ఎలా వొచ్చిందో కూడా చెప్పకుండానే భారీ ఊపు వచ్చేస్తోంది.
అంతా చూస్తున్నది ఒక్కటి – ఆ ఫుల్ టీజర్, ఆ థియేట్రికల్ ట్రైలర్ వస్తే అసలు బజ్ ఎక్కడికెళ్తుందో చూడాలి!
రజనీకాంత్ రీ ఎంట్రీకి ఇది బిగ్గెస్ట్ ఎలివేషన్ కావచ్చు. ‘కూలీ’ వేదికగా మళ్లీ రజనీ మాస్ మంత్రం పూననుందా? వేచి చూడాలి!