ఈ వయస్సులోనూ తలైవర్ క్రేజ్, ఫీజ్ మామూలుగా ఉండటం లేదు. ! ‘జైలర్ 2’ కోసం రజనీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ విని ఇండస్ట్రీ షాక్!
సాధారణంగా ఏ హీరోకైనా వయస్సు పెరిగితే మార్కెట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ రజినీకాంత్ విషయంలో అలాంటి లాజిక్స్ అన్నీ ఫెయిల్! ఏ కథ, ఏ హీరోవచ్చినా… రజినీ మాస్‌కు పోటీ లేదు. ‘జైలర్’తో మరోసారి తన స్టామినా చూపించిన తలైవర్, ఇప్పుడు అదే కథను సీక్వెల్‌గా మళ్ళీ పునరావృతం చేయబోతున్నారు – ‘జైలర్ 2’ రూపంలో.
ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కూలీ’ సినిమాపై ఇప్పటికే రికార్డు స్థాయిలో హైప్ ఉంది. ఈ చిత్రం తర్వాతే రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ‘జైలర్ పార్ట్ 2’ లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్‌గానే జరగుతోంది.
అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం – రజినీకి ఇచ్చే రెమ్యునరేషన్. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ కోసం రజినీకాంత్‌కు రూ. 260 కోట్లు పారితోషికంగా ఇవ్వనున్నట్టు గట్టి టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాదు, దేశవ్యాప్తంగా ఓ రికార్డు రెమ్యునరేషన్‌గా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంకా ఈ సినిమాలో అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి స్టార్‌లు కూడా కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో విడుదలకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
క్లారిటీగా చెప్పాలంటే… రజినీకాంత్ వయస్సు పెరిగినా క్రేజ్ మాత్రం యంగ్ స్టార్‌లకే షాక్ ఇచ్చే రేంజ్‌లో ఉంది. ‘జైలర్ 2’కి ఆయన తీసుకుంటున్న పారితోషికమే అందుకు నిదర్శనం!