‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో విక్టరీ వెంకటేష్ కుమారుడిగా నటించిన బాల నటుడు రేవంత్ కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ అబ్బాయి బుల్లి రాజు పాత్రలో అదరగొట్టాడు. ఈ బుడ్డోడి నటనకి ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సినిమాలో బుల్లి రాజు తన డైలాగ్స్ తో థియేటర్లలో అందరినీ మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. దీంతో బుల్లి రాజు అలియాస్ రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెలబ్రిటీ అయిపోయాడు. వరస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఆఫర్ ని ఓకే చేసారని తెలుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అంటున్నారు.
అనిల్ రావిపూడి – చిరు (chiranjeevi) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో బుల్లి రాజు ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. చిరంజీవి స్వయంగా అడిగి మరీ ఈ పిల్లాడని తన సినిమాలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కంటే ముందే బుల్లి రాజు జనసేనకి ప్రమోషన్స్ చేస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి చిరుతో తీయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేసారు.