సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6గంటల అటు జీ తెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam OTT) అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఆల్రెడీ థియేటర్ లో పెద్ద హిట్ అవటంతో ఓటిటిలో మరోసారి చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇక్కడ కూడా ఇది రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని టీమ్ నమ్ముతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్ నిమిత్తం నిర్మాత ఎంత సంపాదించారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు థియేట్రర్ రిలీజ్ కు ముందే ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ ని జీ సొంతం చేసుకుంది. ఈ రెండు రైట్స్ నిమిత్తం 27 కోట్ల రూపాయలు పే చేసారని తెలుస్తోంది. ఓ రకంగా జీ వారు లాటరి కొట్టినట్లే అంటున్నారు. థియేటర్ రిలీజ్ తర్వాత రైట్స్ అడిగితే కేవలం ఓటిటికే 30 కోట్లు వరకూ చెప్పేవారని చెప్పుకుంటున్నారు. అయితే వెంకటేష్ సినిమాకు 27 కోట్లు అనేది మంచి ఎమౌంటే అనేది నిజం.

ఇదిలా ఉంటే ఈ సినిమా నిడివి విషయంలో ఊహించని షాక్ తగిలింది. థియేటర్లో 2 గంటల 24 నిమిషాలు ప్రదర్శితమైన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల నిడివితో జీ 5లో అందుబాటులో ఉంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. థియేటర్ వెర్షన్‌లో నిడివి కారణంగా తొలగించిన కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి ఓటీటీలో చేరుస్తారని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ముఖ్యంగా, సినిమా ఫ్లాష్ బ్యాక్ లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను జతచేస్తారని ప్రచారం జరిగింది. అయితే, అదనపు సన్నివేశాలు చేర్చకపోగా, ఉన్న సన్నివేశాలకే కత్తెర వేసినట్లు తెలుస్తోంది. దాదాపు 8 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తొలగించడంపై మూవీ టీమ్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.

, , ,
You may also like
Latest Posts from