పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమాకి చివరి క్షణంలో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ ఆలస్యం చేసిన టీమ్, ఇప్పుడు ప్రీమియర్స్ కి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉండగా కూడా కంటెంట్ ఓవర్సీస్ కి చేరలేదని సమాచారం!

ప్రచారంలో మాత్రం “ఓజీ” అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ లో మాత్రం వరుసగా గందరగోళం చేస్తూ వస్తోంది.

అమెరికాలో ఇంకా అనేక థియేటర్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేకపోయాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లలో అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తికాకపోవడంతో బుకింగ్స్ స్టార్ట్ కూడా కాలేదు. కారణం ఒక్కటే — కంటెంట్ ఇంకా వాళ్లకి చేరలేదు!

టీమ్ మాత్రం రేపటికి అన్నీ డెలివర్ అవుతాయని చెబుతున్నా, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం టెన్షన్ లోనే ఉన్నారు. ఈ డిలే వల్ల ప్రీమియర్ షోలు కూడా లేట్ అయ్యే అవకాశం ఉందనే భయం పట్టుకుంది.

“ఓజీ” కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ సడెన్ ట్విస్ట్ అసలు నచ్చడం లేదు!

, , , , , ,
You may also like
Latest Posts from