టిల్లు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సిద్ధు జొన్నలగడ్డ. జోష్‌కు మారుపేరైన ఆయన ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో జట్టు కట్టి ‘జాక్ – కొంచెం క్రాక్’ అంటూ ఆశ్చర్యపరిచారు. ‘బేబి’ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫీల్‌గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాని డైరక్ట్ చేసారు. అయితే సినిమా మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది.
దాంతో ఫస్ట్ వీకెండ్ కే కలెక్షన్స్ లేకుండా పోయాయి. ఈ క్రమంలో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై మేకర్స్ దృష్టి పెట్టారు. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న దాని కంటే ముందుగానే అంటే మే మొదటి వారంలోనే సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందుకు తగ్గట్లుగా డేట్‌ను దాదాపుగా కన్ఫర్మ్ చేశారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సినిమాకు ఎలాగూ కలెక్షన్స్ రూపంలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. కనీసం ఓటీటీ లో ముందు స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయవచ్చనేది నిర్మాతల ఆఅలోచన.
అంతే కాకుండా ముందు స్ట్రీమింగ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ నుంచి కొంత మొత్తం అయినా ఎక్కువ ఆశించే అవకాశాలు ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారట.