మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. జైలర్ మూవీలో తనదైన గ్లామర్, డ్యాన్స్‌తో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్త్రీ-2 చిత్రంలోనూ మెరిసింది. అజ్ కీ రాత్ అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. శ్రద్దాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
YouTubeలో 750 మిలియన్లకు పైగా వ్యూస్, Spotifyలో 139 మిలియన్లకు పైగా ప్రసారాలతో, ఆజ్ కీ రాత్ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ పాటగా నిలిచింది.
ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఈ పాట లిరికల్ వెర్షన్ విడుదల చేయగా.. రెండు నెలల్లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ట్ చేసిన సీన్స్‌ను కలిపి ఈ పాటను రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసారు.
2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొచ్చారు. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు.