సౌత్ ఇండస్ట్రీలో త్రిష పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది గ్లామర్, గ్రేస్, లాంగ్ లాస్టింగ్ కెరీర్. మోడలింగ్‌తో మొదలైన ఆమె జర్నీ, ‘వర్షం’, ‘ఘర్షణ’, ‘96’ వరకు అద్భుతమైన బ్లాక్‌బస్టర్లతో సాగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్‌హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన త్రిష, ఈ మధ్యకాలంలో ‘లియో’ తో తిరిగి తన స్టార్‌డమ్ పవర్‌ని రుజువు చేసింది.
అలాంటి త్రిష ఇటీవల ఒక ఈవెంట్‌లో షాకింగ్ గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. హోస్ట్, “మీకు కమల్ హాసన్‌గారికి ఏదైనా చెప్పాలనిపిస్తుందా?” అని అడగగానే, త్రిష ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్ట్రైట్‌గా బాంబ్ పేల్చేసింది.
“ కమల్ సర్, మీరు ఎప్పుడూ ఇలా ఎలా ఉంటారు? ఎంత హాట్‌గా.. ఎంత డాపర్‌గా! ఏం చేసినా, ఏదైనా వేసుకున్నా మీరు సింప్లీ సూపర్! అందరూ ఇదే అంటారు ” అంటూ స్టేజ్‌పైనే తన క్రష్‌ని బయటపెట్టేసింది.
అంతలోనే కెమెరా కమల్ హాసన్‌పైకి తిరగగా… లెజెండ్ హీరో ఆశ్చర్యంతో కళ్లను పెద్దగా చేసుకుని, ఓ వార్మ్ స్మైల్‌తో త్రిషకు బౌ చేసేశారు. పక్కనే కూర్చున్న శివకార్తికేయన్‌తో హార్ట్‌గా నవ్వుతూ తన ఫన్నీ రియాక్షన్‌తో ఆడిటోరియంను మొత్తం నవ్వులతో కట్టిపారేసారు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు హీట్ పెరిగింది. “ త్రిష నిజంగానే స్టేజ్‌పైన కమల్ హాసన్‌కి హాట్ అనేసింది ” అంటూ నెట్టింట్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్–త్రిష జంట ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘థగ్ లైఫ్’ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించకపోయినా, వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని ఆడియన్స్ గుర్తుపెట్టుకున్నారు. కానీ ఈ స్టేజ్ ఎపిసోడ్‌తో, ఆ ‘రియల్ లైఫ్ కెమిస్ట్రీ’ గురించే ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి!