వ‌రుసగా సినిమాల‌ ప్లాఫుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej). రీసెంట్ గా ‘మట్కా’ (Matka) సినిమాతో వచ్చినా అదీ అలరించలేకపోయింది. ఈ నేపధ్యంలో వ‌రుణ్ తేజ్ ఈ సారి రూట్ మార్చాడు. ఎలాగైనా హిట్టు కొట్టాల‌నే క‌సితో ఉన్న వ‌రుణ్ గతంలో సందీప్ కిష‌న్‌కు వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి భారీ విజ‌యాన్ని అందించిన‌ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. VT15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు.

మేర్లపాక గాంధీ విషయానికి వస్తే ఆయనకు హిట్‌ ట్రాక్‌ రికార్డు ఉన్నా ప్రస్తుతం అతడి చేతిలో పెద్దగా సినిమాలేవి లేవు. గతంలో ఎక్స్‌ప్రెస్‌ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో వంటి సినిమాలు తెరకెక్కించారు. ఈ సినిమాలన్ని కూడా మంచి విజయం సాధించాయి. దీంతో ఆయన నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రమిది.

ఈ చిత్రం రెగ్యుల‌ర్ సినిమాలా కాకుండా రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో కొరియన్‌ బ్యాక్‌ డ్రాప్‌ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాకు తెర‌కెక్క‌నుంది. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయిక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రానికి ‘కొరియన్‌ కనకరాజు’ (Korean Kanakaraju) అనే పేరు ఫిక్స్ చేశార‌ని, ఇంత‌ వరకూ ఎవ‌రూ టచ్‌ చేయని ఓ కొత్త పాయింట్‌ తో ఈ సినిమా రూపొందుతుంద‌ని వినికిడి. ఇదిలాఉండ‌గా ఈ చిత్రంలో ప‌లువురు కొరియన్‌ నటులు న‌టిస్తుండ‌గా ప్ర‌స్తుతం వారి ఎంపిక చేసేందుకు ఆడిషన్స్‌ జరుగుతున్నట్లు స‌మాచారం.

, , ,
You may also like
Latest Posts from