ఇద్దరు తమిళ హీరోలు టైటిల్ కోసం యుద్దం ప్రకటించుకున్నారు. ఇద్దరూ తమ సినిమాలకు ఒకే టైటిల్‌‌‌‌ను ఖరారు చేసి ప్రమోషన్ మెటీరియల్ రిలీజ్ చేసారు. కొద్ది గంటల వ్యవధిలో రెండు సినిమాల టైటిల్స్‌‌‌‌ను ఫస్ట్ లుక్‌‌‌‌తో సహా విడుదల చేశారు. దాంతో ఈ రెండు సినిమాలు హాట్ టాపిక్స్ గా మారాయి. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు..ఏమిటా టైటిల్.

ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు శివకార్తికేయన్ కాగా మరొకరు విజయ్ ఆంటోనీ. గతేడాది ‘అమరన్‌‌‌‌’తో సూపర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్.. ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. జయం రవి, అథర్వ, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శివ కార్తికేయన్ ఈ మూవీ టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేయడంతో పాటు టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. శివాజీ గణేషన్‌‌‌‌ నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘పరాశక్తి’ టైటిల్‌‌‌‌ను ఈ సినిమాకు పెట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. సెవెంటీస్‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో స్టూడెంట్ పాలిటిక్స్‌‌‌‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌‌‌‌‌‌‌‌ను బట్టి తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్‌‌‌‌కు ఇది 100వ సినిమా.

ఇదిలా ఉంటే విజయ్ ఆంటోని హీరోగా అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి కూడా ‘పరాశక్తి’ టైటిల్‌‌‌‌ను ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో చేతిలో గన్‌‌‌‌తో సీరియస్‌‌‌‌ మోడ్‌‌‌‌లో కూర్చున్నాడు విజయ్ ఆంటోని. హీరో విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆయన భార్య మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ రెండు సినిమాలకూ టైటిల్‌‌‌‌ ఒకటి అవడమే కాదు..ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమా కావడం విశేషం.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ చేయించానని విజయ్ ఆంటోని, చెబుతుంటే, తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌, తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సి ల్‌లో రిజిస్టర్ చేశామని శివ కార్తికేయన్ మూవీ టీమ్ చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరికి ఈ టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాలి.

, ,
You may also like
Latest Posts from