ఇండియన్ యాక్షన్ సినిమాల పరంగా ఫుల్ క్రేజ్ క్రియేట్ చేసిన యాష్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘వార్’కి కొనసాగింపుగా వస్తున్న ‘వార్ 2’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈసారి హృతిక్ రోషన్‌కి జోడీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటుండటంతో, ఈ సినిమా మీద ఆసక్తి మరింతగా పెరిగింది.
తెలుగు బిజినెస్ విషయానికి వస్తే… టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా తెలుగు రైట్స్‌ని భారీ మొత్తానికి దక్కించుకున్నారు. ఆయన సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ జరుగుతోంది.
ఇక ఈ సినిమాకి ప్రమోషన్ పరంగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. విజయవాడ వేదికగా ఈ ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వేదికను ఫైనలైజ్ చేయడం, అనుమతులు పొందడం లాంటి పనులు పూర్తి అవుతున్నాయి. ఈ వేడుకలో హృతిక్ రోషన్ ప్రత్యక్షంగా పాల్గొననుండగా, ఎన్టీఆర్ ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్ చేస్తారని సమాచారం.
ఈ ఈవెంట్‌ను ఆగస్టు రెండో వారంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హృతిక్ మరియు ఎన్టీఆర్ అందుబాటును బట్టి ఖచ్చితమైన తేదీని తొలి వారంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్ రావడం, సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల కుతూహలాన్ని రెట్టింపు చేస్తోంది.
అందులోనూ ఇది రజినీకాంత్ ‘కూలీ’ సినిమాతో కలసి ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు రిలీజ్ కావడంతో టికెట్ కౌంటర్ల వద్ద భారీ క్లాష్ జరిగే అవకాశాలున్నాయి.
వార్ 2 తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంటే ఇక ఎన్టీఆర్ ఫాన్స్ కి, యాక్షన్ మాన్స్ కి దివాళి ముందే వచ్చినట్లే!