ఒకప్పుడు లవర్ బోయ్ గా తమిళ,తెలుగు భాషల్లో అలరించిన సిద్దార్ద్ గత కొంతకాలంగా కెరీర్ పరంగా వెనకపడ్డాడు. ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేయటం తప్పించి హిట్ కొట్టింది లేదు.  గ‌తేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. ‘ఇండియన్ 2’తో ప్రేక్షకుల ముందు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. తాజాగా సిద్దార్థ్ త‌న కొత్త సినిమా మిస్ యూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

థియేటర్స్ లో యావరేజ్ అనిపించుకున్న ‘మిస్ యు’ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చింది. అమేజాన్ ప్రైమ్ లో స్టీమింగ్ అవుతోంది.

ఈ సినిమాకు ఎన్ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శకత్వం వహించగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.

చాల రోజుల తర్వాత సిద్దార్థ్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. లవర్ బాయ్ పాత్రను పోషించాడు.

తెలుగులో వ‌చ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాని గుర్తు చేస్తుంది ‘మిస్‌ యు’.

‘హాయ్ నాన్న’ లో పాప చుట్టూ క‌థ తిరిగితే, ఇందులో ఓ కేసుతో క‌థ‌ని ముడిపెట్టారు. మిగ‌తాదంతా మామూలే.

అక్కడక్కడా కొన్ని కామెడీ స‌న్నివేశాలు, నాయ‌కానాయిక‌ల జోడీ, వాళ్ల అభిన‌యం మిన‌హా ఇందులో చెప్పుకొనేంత ఏమీ లేదు.

7 మైల్స్ ప‌ర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

, ,
You may also like
Latest Posts from