2025లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా కలసిరాని సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ ఎవరికి పెద్ద రిలీజ్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్న పరిస్దితి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే – 2026 మాత్రం పూర్తిగా మాస్ ఫెస్టివల్‌లా ఉండబోతోంది.

చిరంజీవి రెండు సినిమాలతో వస్తున్నారు, ప్రభాస్ కూడా డబుల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్‌లు కూడా ఒక్కో సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు.

అయితే, 2026లో మాత్రం మహేష్ బాబు – అల్లు అర్జున్ లకు మినహాయింపు . ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు పని చేస్తున్న ప్రాజెక్టులు చాలా భారీ స్థాయిలో, పాన్-ఇండియా, అంతర్జాతీయ మార్కెట్‌కి టార్గెట్ అయ్యాయి.

మహేష్ బాబు – ఎస్‌.ఎస్‌. రాజమౌళితో చేస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ 2027లోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో షూట్ జరుగుతోంది.

అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో చేస్తున్న హై బడ్జెట్ యాక్షన్ డ్రామా కూడా 2027కే లైన్‌లో ఉంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జోరుగా జరుగుతోంది.

అందుకే 2026లో వీరిద్దరి సినిమాలు థియేటర్లలో రావు అనేది నిజం. అయితే ఫ్యాన్స్‌కి ఓదార్పు ఏమిటంటే – ఈ రెండు సినిమాలు గ్లోబల్ రేంజ్‌లో వస్తున్నాయి. అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

అంటే 2026లో అన్ని స్టార్ హీరోలు ఫైర్ చేసేలోపు, మహేష్ బాబు – అల్లు అర్జున్ మాత్రం 2027లోనే బ్లాస్ట్ చేయబోతున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from