రామ్ చరణ్ రొమాంటిక్ డ్రామా ‘ఆరెంజ్’ ని రీ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూవీ ప్లాప్‌గా నిలిచింది. కానీ ‘ఆరెంజ్’ మూవీ అప్పటి యూత్, మెగా ఫ్యాన్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి.
‘బొమ్మరిల్లు’ మూవీ డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్, జెనిలియా హీరో హీరోయిన్లుగా ‘ఆరెంజ్’ మూవీ తెరకెక్కింది.
2010 నవంబర్ 26న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం లభించలేదు.
అయితే ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. ఇందులో లవర్‌గా చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
పాటలతో సంగీత ప్రియులను అలరించిన ఆరెంజ్ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు.
2023లో ఈ సినిమా రీ రిలీజ్ అవ్వగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసారి ఏకంగా ప్రేమికుల రోజు దినోత్సవంగా సందర్భంగా అదే ఆరెంజ్ మళ్లీ థియేటర్లోకి వస్తుండటంతో ఈ వాలంటైన్స్ డే లవర్స్‌కి మరింత ప్రత్యేకంగా నిలవనుంది.
జీవితాంతం అదే ప్రేమ ఇవ్వలేనని, టెంపరరీగా మాత్రమే లవర్ ఉండగలను అంటూ గర్ల్ ఫ్రెండ్స్‌ని మారుస్తుంటాడు చరణ్. ఒక్కరినే జీవితాంతం ప్రేమించలేమని, మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు.. కాబట్టి ప్రేమించుకున్నన్ని రోజులు ప్రేమించుకుందాం అనే సరికొత్త కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించాడు భాస్కర్.