రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం‘గేమ్ ఛేంజర్’ (Game Changer). జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఓపెనింగ్స్ ఓకే అనిపించినా, సంక్రాంతి సెలవులు క్యాష్ చేసుకోలేకపోయింది. బ్రేక్ ఈవెన్ అయ్యేంత కలెక్ట్ చేయలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి భారీ నష్టం వచ్చిందనే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు మంచి పేరు వచ్చింది. అంజలికి కూడా మంచి ఫెరఫార్మెన్స్ ఇచ్చిందని అందరూ మెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో నిరాశ పడ్డ అంజలి ఈ సినిమా గురించి మాట్లాడింది.

అంజలి ఈ సినిమా సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్నకి(రామ్ చరణ్) (Ram Charan) భార్య పాత్రలో నూ, రామ్ నందన్ కి(రామ్ చరణ్) కి తల్లి పాత్రలోనూ కనపడింది. ఎంత బాగా ఆమె చేసినా సినిమా ఆడకపోవటంతో ఆమె పాత్రకి అనుకున్నంత రెస్పాన్స్ వినిపించలేదు. ఈ విషయాలపై తాజాగా అంజలి స్పందించింది.

అంజలి మాట్లాడుతూ.. “ఒక యాక్టర్ గా నా రెస్పాన్సిబిలిటీ మాత్రం నేను నిర్వర్తించాను. నాకు ఒక రోల్ ఇచ్చారు. దాన్ని బాగా చేయాలి. అక్కడితో నా పని అయిపోతుంది.

అయినప్పటికీ సినిమాని ఆడించాలి అనేది మా తపన. అందుకోసం ప్రమోషన్స్ కి వెళ్లడం, ఆడియన్స్ కి సినిమా గురించి మా పాత్ర గురించి చెప్పడం, మూవీ రిలీజ్ టైంని గుర్తు చేయడం.. వంటివి మా బాధ్యత. తర్వాత మా చేతుల్లో ఉండదు.

ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడాలి అంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి. నేను ‘గేమ్ ఛేంజర్’ కి 200 శాతం ఎఫర్ట్ పెట్టాను. నా వరకు నేను హ్యాపీ. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ చూసి నాకు చాలా మంది మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

సినిమా బాలేదు అని ఎవ్వరూ చెప్పలేదు. ఇది మంచి సినిమా అని చెప్పారు. సినిమా బాగుండటం వేరు. మంచి సినిమా వేరు. నేను బాగా యాక్ట్ చేశాను అని చెప్పారు. నాకు అది సరిపోతుంది. ఇక మిగిలిన దాని గురించి మాట్లాడాలి అంటే దానికి ఒక అరగంట సెపరేట్ టైం కావాలి” అంటూ చెప్పుకొచ్చింది.

, , , , ,
You may also like
Latest Posts from