నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి డైరక్షన్ చేసారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. పెద్ద హిట్ అవుతుందనుకున్న ఈ చిత్రం ఓ స్దాయికి వెళ్లి ఆగిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఈనెల 21 నుంచే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో జస్ట్ ఓకే అనిపించుకున్న ఈ చిత్రం ఓటిటిలో రెస్పాన్స్ ఏమిటని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం మేరకు ఓటిటిలో ఈ సినిమాలో అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నార్త్ నుంచి ఈ సినిమాకు రెస్పాన్స్ బాగుందని సమాచారం. చాలా దేశాల్లో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఇది ఊహించని సక్సెస్ అని చెప్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఓటిటి రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అదే ప్లస్ అయ్యిందని చెప్తున్నారు.
ఇక ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.