సినిమా పరిశ్రమలో సక్సెస్ వచ్చినప్పుడు ఏ స్దాయిలో నెత్తిమీద పెట్టుకుంటారో, అదే సక్సెస్ కనుమరుగు అయ్యినప్పుడు మొహమాటం లేకుండా క్రింద పడేస్తారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ పరిస్దితి అలాగే ఉంది. ఆయన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 చిత్రాలు రెండు డిజాస్టర్స్ అవటం ఆర్దికంగానే కాదు, కెరీర్ పరంగానూ ఇబ్బందుల్లో పడేసింది.
ఇప్పుడు ఆయన కథలు వినే హీరోలు కరువు అయ్యారు. రేసులో ఆయన వెనక పడ్డారు. అయితే ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. కానీ మీడియా ఊరుకోవటం లేదు. అవకాసం దొరికినప్పుడల్లా ఆడేసుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్ వర్షం కురుస్తోంది. తాజాగా కోన వెంకట్ చేసిన కామెంట్స్ తో పూరి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇంతకీ కోన వెంకట్ ఏమన్నారు.
పూరి కెరీర్ లో వరస్ట్ పీరియడ్ ఇది కాదంటున్నాడు రచయిత కోన వెంకట్. ఇంతకంటే వరస్ట్ పీరియడ్ ను పూరి జగన్నాధ్ చూశాడని, అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడని, కాబట్టి మరోసారి ఆయన సక్సెస్ కొట్టడం గ్యారెంటీ అంటున్నాడు కోన.
పూరిలో ఉన్న టాలెంట్ ఎక్కడికీ పోలేదని, త్వరలోనే ఆయన ఓ మంచి హిట్ ఇస్తాడని అంటున్నాడు కోన. ప్రస్తుతం పూరి దగ్గర 4 కథలు సిద్ధంగా ఉన్నాయంట. దాంట్లో ఏ కథతో ప్రస్తుతం ముందుకెళ్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. అయితే కథలు ఎన్ని ఉన్నా వినే హీరో ఏడి అంటున్నారు సోషల్ మీడియా జనం.
గోపీచంద్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు కథలు రాసుకున్నాడని , అయితే ఎవరూ దొరకటం లేదని అంటున్నారు. అలాగే వెంకటేష్ తో ఓ ప్రాజెక్టు గతంలో అనుకున్నా ఇప్పుడు పరిస్దితి అయితే లేదు.
బాలకృష్ణ దగ్గర పూరి జగన్నాధ్ కు ఓపెన్ ఆఫర్ ఉంది. అయితే బాలయ్య ఇప్పుడు ఫుల్ బిజిగా ఉన్నారనేది నిజం.