తెలుగు పరిశ్రమలో నయనతారకి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. తక్కువ సినిమాలే చేసినా, ప్రతి సినిమా ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంది. ఆమెపై ఉన్న మార్కెట్, ఫ్యాన్ బేస్ – అంతా కోలీవుడ్ తరఫునే కాదు, తెలుగులోనూ విశేషం. ఇక్కడ డిమాండ్ తగ్గినా, డామినేషన్ మాత్రం తగ్గలేదన్నట్టు ఆమె నిర్ణయాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
తాజాగా నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా ఎంటర్టైనర్కు హీరోయిన్గా ఫైనల్ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆమెకు సంబంధించి గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
సినిమాకు అఫీషియల్‌గా ఒప్పుకోడానికి ముందు, నయనతార డబుల్ డిజిట్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం మేకర్స్‌ను కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె బిజినెస్ వాల్యూను బట్టి ఆ డిమాండ్ తప్పు కాదన్న అభిప్రాయంతో, చివరకు రూ.6 కోట్లు రెమ్యూనరేషన్ ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా నిన్న చెన్నైలో నయనతారపై ఒక స్పెషల్ వీడియో బైట్ కూడా షూట్ చేశారు. ఇది షూటింగ్ మొదలైనందుకు ముందు అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 22 నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి 2026 రిలీజ్‌ను టార్గెట్ చేస్తూ అనిల్ రావిపూడి ఓ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి – నయనతార కాంబినేషన్ ఎప్పుడూ రేర్ కనబడుతుంది, ఇప్పుడు అనిల్ రావిపూడి బ్రాండ్ కామెడీతో ఈ కలయికపై అంచనాలు బాగా పెరిగాయి.