చిరంజీవికి వయస్సు పెరుగుతున్నా క్రేజ్ తగ్గటం లేదు. ఆయనతో సినిమా చెయ్యాలనే నిర్మాతల ఉత్సాహం తగ్గటం లేదు. యంగ్ డైరక్టర్స్ కథలు రెడీ చేసుకుని తిరుగుతున్నారు. అలా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే…

మెగాస్టార్ చిరంజీవి త్వరలో అనీల్ రవిపూడి దర్శకత్వంలో సినిమా షూట్ ప్రారంభించనున్నాడు. ఈ ఎంటర్‌టైనర్ సినిమా సంక్రాంతి 2026కి రిలీజ్ కానుంది. ఆ తర్వాత చిరంజీవి మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ డైరక్టర్ మరెవరో కాదు బాబీ. వీరిద్దరూ కలిసి గతంలో ‘వాల్టేర్ వీరయ్య’ అనే భారీ హిట్ సినిమా ఇచ్చారు.

ఈ కొత్త ప్రాజెక్టు ఇప్పటికే లాక్ అయ్యింది కానీ భారీ బడ్జెట్ కారణంగా టాప్ ప్రొడక్షన్ హౌసులు చాలా తిరస్కరించారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు హిట్ అయినా, ప్లాన్ చేసిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవటం సమస్యగా మారింది.

ఈ క్రమంలో మైత్రీ మూవీస్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్ వంటి ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు ఈ ప్రాజెక్టు కోసం అప్రోచ్ చేసినప్పటికీ తిరస్కరించాయి.

ఆ తర్వాత ఇప్పుడు విజయ్ ‘జన నాయగన్’, యశ్ ‘టాక్సిక్’ వంటి highly anticipated సినిమాలను నిర్మిస్తున్న కెవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. కెవీఎన్ ప్రొడక్షన్స్, ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించి ఉంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మాణం గురించి ఈ ఏడాదిలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

You may also like
Latest Posts from