బాలీవుడ్ యాక్షన్ మల్టీస్టారర్ వార్ 2 టీజర్ వచ్చినప్పటి నుంచే అంతా ఒకటే మాట్లాడుకుంటున్నారు – అదేనండి, కియారా అద్వానీ బికినీ షాట్! తెరపై ఈ గ్లామరస్ లుక్‌ ఆమెకు ఇదే ఫస్ట్ టైమ్ కావడంతో పాటు, టీజర్‌ను చూసినవారిని ఈ స్టిల్ మంత్ర మగ్దులని చేసింది. కానీ… ఆ స్టిల్ మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్ట్ ఓ కొత్త వివాదాన్ని లేపింది.

వర్మ తన స్టైల్‌లో బికినీ స్టిల్ షేర్ చేస్తూ,

“హృతిక్-ఎన్టీఆర్ మధ్య యుద్ధం దేశాల కోసం కాదు… కియారా కోసం అయితే బంపర్ బ్లాక్‌బస్టర్ అవుతుంది” అంటూ తనదైన శైలిలో కామెంట్ చేసారు.

అని రాసిన వ్యాఖ్య నెటిజన్లకు గుండెకు తగిలింది. మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్న ఈ వ్యాఖ్యను చాలా మంది తీవ్రంగా ఖండించారు.
“ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వ్యక్తి పబ్లిక్ ఫిగర్‌గా ఎలా ఉంటారు?”

అంటూ సోషల్ మీడియాలో వ్యతిరేక కామెంట్ల వర్షం కురిసింది. విమర్శల తాలూకు తీవ్రత పెరిగిపోవడంతో, వర్మ తన పోస్ట్‌ను బుధవారం ఉదయం నిశ్శబ్దంగా తొలగించారు.

అయితే వర్మ చేసిన వ్యాఖ్యల వల్ల ఒకదానిపై అంతగా మాట్లాడని జనాలు ఇప్పుడు అదే స్టిల్‌పై మరింతగా దృష్టిపెట్టారనడంలో సందేహమే లేదు. వాస్తవానికి, కియారా కూడా తన సోషల్ మీడియా పోస్టులో

“ఈ బికినీ లుక్ తెరపై నా ఫస్ట్ అటెంప్ట్” అని పేర్కొనడం ద్వారా, ఆ షాట్‌కు ప్రత్యేకత కల్పించారు.

వార్ 2, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్. 2019లో హిట్ అయిన వార్ సినిమాకు ఇది సీక్వెల్. టీజర్‌లో హృతిక్ (కబీర్) – ఎన్టీఆర్ మధ్య యాక్షన్ క్లోష్ థ్రిల్లింగ్‌గా కనిపించింది. ఇక కియారా లుక్ మాత్రం గ్లామర్ డోసును రెట్టింపు చేసింది. సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

, , , ,
You may also like
Latest Posts from