ఒకవైపు పులిగా తన నటనతో తెరపై చెలరేగే ఎన్టీఆర్, మరో ప్రక్క బాహుబలితో దేశవ్యాప్తంగా ఓ ఫోర్స్‌గా నిలిచిన రానా… ఈ ఇద్దరూ తెరపై తలపడితే… ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో ఊహించడమే కష్టం! స్క్రీన్ మీద ఒకరినొకరు ఢీకొట్టేలా త్రివిక్రమ్ లాంటి మాస్టర్ డైరెక్టర్ ప్లాన్ చేస్తే, అది సినిమా కాదు… ఊహించని పెద్ద యుద్ధం. ఇది కేవలం ఫ్యాన్స్‌కే కాదు… ఇండియన్ సినిమా అభిమానులందరికీ వేచి చూసే విజువల్ ఫెస్టివల్ అవుతుంది. అలాంటి ఫీస్ట్ త్వరలో కనువిందు చేయబోతోందా

ఇది తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని అనూహ్య పరిణామం. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ చేయాల్సిన సోషియో, మైథలాజికల్‌ మూవీ ఇప్పుడు ఎన్టీఆర్‌ను వరించింది. ఈ లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ కాంబోలో ‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చింది. మరోసారి వారిద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతుండటం, అందునా పౌరాణికాలకు పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌ ఎన్టీఆర్‌ అనే పేరు ఉండటంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో, రానా నెగిటివ్ పాత్రలో విలన్ గా కనిపించనున్నాడనే వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రానా యొక్క డీప్ వాయిస్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను కలిపితే – ఈ మైథలాజికల్ యుద్ధం థియేటర్లలో మామూలుగా ఉండదు. త్రివిక్రమ్ ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదే అతని అతిపెద్ద విజన్ ప్రాజెక్ట్ అవబోతోంది.

ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పెట్టిన పోస్ట్‌లు ఈ వార్తను ధృవీకరించేలా ఉన్నాయి. ‘నేను అభిమానించే అన్న.. అత్యంత ఇష్టమైన దేవుడి పాత్రలో..’ ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌ ఈజ్‌ కమింగ్‌’ అంటూ నాగవంశీ పోస్ట్‌లు పెట్టారు. వీటితో పాటు కార్తికేయుడి తాలూకు సంస్కృత శ్లోకాలను రాసుకొచ్చారు.

, , ,
You may also like
Latest Posts from