ఎన్టీఆర్. హృతిక్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ‘వార్ 2’ ప్రమోషన్స్ పెద్దగా హంగామా చేయలేదని అభిమానులు భావిస్తున్న సమయంలో, తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న ఎస్. నాగ వంశీ హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హాజరై స్టేజ్ పై గ్లామర్, ఎనర్జీని రెట్టింపు చేశారు.
తన ప్రసంగంలో ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా అగ్రెసివ్ మోడ్ లో కనిపించాడు. సినిమాలో తనకు ఉన్న నమ్మకాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ, తన తాత ఎన్టీఆర్, తండ్రి, కుటుంబ సభ్యుల సపోర్ట్ గురించి హృదయపూర్వకంగా గుర్తు చేసుకున్నాడు. “వార్ 2 అందరికీ గర్వకారణం అవుతుంది” అని గట్టిగా చెప్పి, ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.
అలాగే ‘‘రామోజీ రావు గారు తన బ్యానర్‌లో నన్ను పరిచయం చేశారు. మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి నా పక్కన నాన్నగారు, అమ్మ తప్ప ఎవరూ లేరు. మొదటిసారి నన్ను కలిసి అభిమాని మూజీబ్. అలా మొదలైన జర్నీలో ఇప్పుడు ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం. మీ ప్రేమను పెంచుతూ వెళ్లారే తప్ప తగ్గలేదు. నాన్న హరికృష్ణ గారికి, అమ్మ షాలినిలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సినిమా షూటింగ్స్‌తో నేను తీరిక లేకుండా ఉంటే ఇంటిలో ఉండి అన్ని చూసుకుంటున్న నా భార్య ప్రణతితో పాటు మా అబ్బాయిలు అభయ్ రామ్, భార్గవ్‌కి ప్రేమతో నా హగ్స్. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు. అన్నారు.
ఎన్టీఆర్ క్యాజువల్ గా చెప్పినా ఈ మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వాడి,వేడి చర్చ జరుగుతోంది.
ఇక హృతిక్ రోషన్ మాత్రం సింపుల్ & ఎలిగెంట్ గా మాట్లాడి, ఎన్టీఆర్ టాలెంట్, కష్టపడి పనిచేసే తీరు గురించి ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా, ఎన్టీఆర్ వంట చేసే నైపుణ్యంపై ప్రత్యేకంగా చెప్పి అందరినీ నవ్వించాడు. ఇద్దరూ ఒకరినొకరు కితాబిస్తూ స్టేజ్‌పై కలిసిన ఈ కాంబినేషన్ ఫ్యాన్స్‌కు పక్కా విజువల్ ఫీస్ట్ అయ్యింది.
అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో, వైఆర్ఎఫ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.