ప్రభాస్ – సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ మల్టీలాంగ్వేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రణయ్‌ రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటించనున్నారు.

‘స్పిరిట్‌’ పై అభిమానుల్లో ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘అనిమల్’ వంటి ఇంటెన్స్‌ యాక్షన్‌-ఎమోషనల్‌ డ్రామాలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సందీప్‌ రెడ్డి, పాన్‌-ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలసి పని చేయడం వల్ల ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

సెప్టెంబర్‌ చివర్లో పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది. అలాగే ఫస్ట్‌ షెడ్యూల్‌ మాత్రం విదేశాల్లోనే జరగనుంది. ఈ కోసం దర్శకుడు సందీప్‌ ఇప్పటికే మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్‌ వంటి ప్రదేశాల్లో లొకేషన్‌ రెక్కీలు పూర్తిచేశారు. కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించే ప్లాన్‌లో ఉన్నారు.

ప్రభాస్‌ నవంబర్‌ నుండి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనువిందు చేయనున్నారు. ఈ మధ్యలో , సంగీత దర్శకుడు హర్ష వర్ధన్‌ రామేశ్వర్‌ ఇప్పటికే పాటల కాంపోజిషన్‌ను పూర్తిచేశారని సమాచారం.

అలాగే ఈ చిత్రంలో ప్రభాస్‌ పాత్ర పూర్తిగా మాస్‌ & పవర్‌తో నిండిన శక్తివంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర. సాధారణంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లలో మాత్రమే కాకుండా, భావోద్వేగభరిత సన్నివేశాల్లో కూడా ఓ ఇన్‌టెన్స్‌ వైబ్‌ కలిగించేలా ఆయన క్యారెక్టర్‌ను డిజైన్‌ చేస్తున్నారని టాక్‌. ప్రభాస్‌ స్క్రీన్‌పై కనిపించే ప్రతి ఫ్రేమ్‌కి ‘అథారిటీ’ & ‘పవర్’ ఫీల్‌ వచ్చేలా ఉంటుందట.

, , , ,
You may also like
Latest Posts from