రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాస్ జాతర మొదటి నుంచి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అది మరేదో కాదు సెప్టెంబర్ 5 .

అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే అదే రోజు అనుష్క శెట్టి ఘాటి , తేజ సజ్జా మిరాయి , శివకార్తికేయన్–ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న మధరాసి కూడా రిలీజ్ కానున్నాయి. అంటే మాస్ జాతరకి స్ట్రాంగ్ కాంపిటీషన్ తప్పదన్నమాట.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఘాటి, మిరాయి డేట్స్ మార్చుకుంటున్నాయట. దాంతో మాస్ జాతర, మధరాసి మాత్రం సెప్టెంబర్ 5నే థియేటర్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం బలంగా ఉంది.

కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది! ఆగస్టు 27 అంటే వినాయక చవితి హాలిడే + లాంగ్ వీకెండ్. అంతేకాదు సోలో రిలీజ్ కూడా. కానీ సెప్టెంబర్ 5న మాత్రం క్రౌడెడ్ విండో. అంటే కలెక్షన్స్ మీద పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. చూడాలి… మాస్ జాతర టీమ్ ఎలా అధికారికంగా డేట్ అనౌన్స్ చేసి, బజ్ క్రియేట్ చేస్తుందో!
‘మాస్ జాతర’ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీల నటించారు. ‘ధమాకా’ తర్వాత మరోసారి వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు రూపొందిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. భీమ్స్ సినిమాకు సంగీతం అందించారు.

, , , , ,
You may also like
Latest Posts from