తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సిబుల్ డైరెక్టర్స్ అంటే శేఖర్ కమ్ముల, క్రిష్ ల పేర్లు టాప్‌లో ఉంటాయి. ఎమోషన్స్‌ని స్క్రీన్‌పై బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేయడం, హార్ట్ టచింగ్ డ్రామా క్రియేట్ చేయడం క్రిష్స్ స్పెషాలిటీ. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె – ఇవన్నీ ఆల్‌టైమ్ బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు.

కానీ… గత కొన్నేళ్లుగా క్రిష్ కెరీర్ పూర్తిగా డౌన్ హిల్‌లో పడిపోయింది. 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ అయ్యాక, బయోపిక్ NTR కథనాయకుడు డిజాస్టర్ అయ్యింది. కంగనా నటించిన మణికర్ణిక నుంచి, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు నుంచి వాక్ అవుట్ అయ్యాడు. ఆ సినిమాలు కూడా ఫ్లాప్‌గానే మిగిలాయి.

ఆ తర్వాత డైరెక్ట్ చేసిన కొండపొలం ఆడియెన్స్ వద్ద ఆమోదం పొందలేదు. ఇప్పుడు అనుష్కతో చేసిన ఘాటి రిలీజ్ అయ్యింది. కానీ షాకింగ్‌గా… డే వన్ నుంచే డిజాస్టర్ టాక్ ! ఓపెనింగ్స్ కూడా బావోలేదు.

ఎమోషనల్ డ్రామాకి మాస్టర్ అయిన క్రిష్, యాక్షన్ పాత్‌లోకి వెళ్లి ఆ సెన్సిబిలిటీని మిస్సయ్యాడనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇండస్ట్రీలో ఇప్పుడు “క్రిష్ కు ఏమైందీ? మళ్లీ తన ట్రాక్‌లోకి వస్తాడా?” అన్న డౌట్స్ మొదలయ్యాయి.

, , , ,
You may also like
Latest Posts from