సందీప్ రెడ్డి వంగ పేరు వినగానే – వైలెన్స్, ఇంటెన్స్ ఎమోషన్స్, మాస్ కనెక్ట్ గుర్తుకువస్తాయి. “అర్జున్ రెడ్డి” – “కబీర్ సింగ్” – “యానిమల్” మూడు సినిమాలతోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేము. అంతలా తన మార్క్ టేకింగ్తో ట్రెండ్ క్రియేట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా సందీప్ సినిమాలకు ఫ్యాన్ అయ్యాడంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్‌తో పాన్ ఇండియా లెవల్‌లో “స్పిరిట్” సినిమా చేయడానికి రెడీ అవుతున్న సందీప్, మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. హీరోగా స్టార్‌ని కాకుండా, చిన్న హీరోతో – కొత్త కథ, కొత్త టీమ్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అదే కాదు, ఈసారి డైరెక్టర్‌గా కాదు… ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు!

తన సొంత బ్యానర్ “భద్రకాళి పిక్చర్స్” మీద కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలకు ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ లైనప్‌లో మొదటి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని టాక్.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణు ను ఎంపిక చేశాడట.
హీరోగా “మేం ఫేమస్” ఫేమ్ సుమంత్ ప్రభాస్ ను ఫిక్స్ చేశారని సమాచారం.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్, రా కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోందట.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా రానుందని ఇండస్ట్రీలో టాక్ జోరుగా వినిపిస్తోంది.

మరి దర్శకుడిగా బ్లాక్‌బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ, నిర్మాతగా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడో..? ఈ కొత్త ఎక్స్‌పెరిమెంట్‌తో మళ్లీ ఇండస్ట్రీని షేక్ చేస్తాడా..?

, , , , ,
You may also like
Latest Posts from