
వీకెండ్‌లో మాస్ వసూళ్లు సాధించిన పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా “ఓజీ”, సోమవారం–మంగళవారం మాత్రం మిక్స్ ట్రెండ్‌నే చూపించింది. ఇప్పుడు అసలు టెస్ట్ రేపటి నుంచే మొదలవనుంది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫెస్టివల్ డేస్ ఎంత మద్దతు ఇస్తాయనేది కీలకం.
వరల్డ్‌వైడ్‌గా సినిమా మంచి రికవరీ మోడ్‌లో ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా బయ్యర్స్‌కి పూర్తి కంఫర్ట్ రాలేదు. అయితే ఓవర్సీస్‌లో మాత్రం అంచనాలకంటే రెండింతలు కలెక్షన్లు రావడంతో కొంత వరకూ గ్యాప్ కవర్ అవుతోంది.
ఎక్కడ టెన్షన్ ఉందంటే…
సినిమా 6 రోజులు పూర్తి చేసేసరికి కూడా – తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏరియాలోనూ బ్రీక్‌ఈవెన్ జరగలేదు. థియేట్రికల్ రైట్స్ చాలా హై ప్రైస్‌కి అమ్మేయడంతో, ఇంకా కనీసం ₹50 కోట్ల షేర్ రావాల్సి ఉంది. అప్పుడే సినిమా సూపర్‌హిట్ స్టేటస్‌కి చేరుతుంది.
