‘అఖండ’ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అఖండ విజయమే ఇప్పుడు సీక్వెల్‌కు ఆకాశాన్నంటిన క్రేజ్ తీసుకువచ్చింది. బాలయ్య మార్కెట్‌ ఒక్కసారిగా మారిపోయింది. అదే జోష్‌తో వస్తున్న ‘అఖండ 2’ థియేట్రికల్, OTT బిజినెస్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది.

అఖండ 2 బిజినెస్ బ్లాస్టింగ్ ఫిగర్స్

నెట్‌ఫ్లిక్స్ 80 కోట్లకుపైగా ఇచ్చి OTT రైట్స్ దక్కించుకుంది – బాలయ్య కెరీర్‌లో ఎప్పుడూ చూడని రేంజ్!
థియేట్రికల్ బిజినెస్‌ 100 కోట్ల మార్క్‌ను దాటేసింది – ఇప్పటి వరకూ బాలయ్య సినిమాలెవీ చేరని మైలురాయి.

ఆంధ్రా (6 టెర్రిటరీస్‌) alone 50Cr, సీడెడ్‌, నిజాం కలిపి తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 95Cr.
వరల్డ్‌వైడ్ బిజినెస్‌ 115Cr దాటేలా లెక్కలు పక్కా!

ట్రేడ్ టాక్ ప్రకారం, ‘అఖండ 2’తో బాలయ్య మొదటిసారి 100Cr షేర్ దాటి, 150Cr షేర్ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ పక్కా అంటున్నారు. ఇది ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ బిజినెస్‌గా రికార్డ్ అవుతుందనే హైప్ మేకర్స్‌లోనూ, ఫ్యాన్స్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

“అఖండ 2” కేవలం ఓ సినిమా కాదు, బాలయ్య మార్కెట్‌కి కొత్త నిర్వచనం ఇస్తున్న మైలురాయి అని చెప్పొచ్చు!

, , , , ,
You may also like
Latest Posts from