
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన “వార్ 2” ఆగస్టులో భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిందిగానీ… బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందింది.
367 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం పూర్తిగా దారుణంగా పడ్డింది. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన “దేవర” ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా, “వార్ 2” తెలుగు ఫైనల్ రన్ కంటే ఎక్కువ రావడం, ఈ విఫలాన్ని స్పష్టంగా చెబుతోంది.
Netflix మౌనం… ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పీక్స్!
Hindi film #War2 is expected to premiere on Netflix India on October 9th.
— Streaming Updates (@OTTSandeep) October 4, 2025
Also in Tel, Tam. pic.twitter.com/moI778dooW
“వార్ 2″ని అక్టోబర్ 9 నుంచి అన్ని భాషల్లో Netflixలో స్ట్రీమ్ చేయాలనే ప్లాన్ ఉందని సమాచారం. కానీ ఇప్పటివరకు ప్లాట్‌ఫారమ్ నుంచి ఎలాంటి అధికారిక అనౌన్స్‌మెంట్ రాలేదు.
ఈ మౌనం వల్ల ప్రేక్షకుల్లో సస్పెన్స్ మరింత పెరుగుతోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ భారీ స్పై యాక్షన్ డ్రామా, OTTలో ఎప్పుడొస్తుంది? Netflix ఎందుకు సైలెంట్‌గా ఉంది? అన్న ప్రశ్నలతో నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు.
ఇక చూడాలి… Netflix అప్‌డేట్ ఎప్పుడొస్తుందో, “వార్ 2” నిజంగా OTTలో హిట్టవుతుందో, లేక థియేటర్స్‌లోలా ఫ్లాప్ అవుతుందో!
