విదేశీ ట్రిప్‌ నుంచి తిరిగి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ పూర్తి ఉత్సాహంతో పనిలో మునిగిపోయారు. భార్య స్నేహా పుట్టినరోజు సందర్భంగా యూరప్‌కి వెళ్ళిన బన్నీ, ఇప్పుడు ముంబైలో జరుగుతున్న తన నెక్స్ట్‌ మూవీ షూటింగ్‌కి రెడీ అయ్యారు.

అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ముంబైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌కి హాలీవుడ్‌ టెక్నీషియన్లు, ఇంటర్నేషనల్‌ యాక్టర్స్‌ కూడా జాయిన్‌ కావడంతో స్కేల్‌ మరింత పెరిగింది.

ఇది సినిమా కోసం అత్యంత కీలకమైన రెండు నెలలు అవుతాయి. ఈ లాంగ్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాతే మూవీ రిలీజ్‌ డేట్‌పై స్పష్టత రానుంది. ప్రస్తుతం బన్నీ డిసెంబర్‌ 2026 రిలీజ్‌కి టార్గెట్‌ చేస్తున్నా, పరిస్థితులు చూస్తే అది 2027కి షిఫ్ట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయట!

సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో దీపికా పదుకోన్‌ ఒక లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, మృణాళి ఠాకూర్‌, జాన్వీ కపూర్‌ పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సాయి అభ్యంకర్‌ ట్యూన్స్‌ అందిస్తున్నారు.

మొదటిసారి అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో సెట్ అవుతున్న మాస్ ఎక్స్‌ప్లోషన్ ఎలా ఉండబోతోందో చూడాలి!

, , , , ,
You may also like
Latest Posts from